Akshara chit fund scam : డిపాజిటర్లను మోసం చేసి గత ఆరు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అక్షర చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావును ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. చిట్టీల పేరిట డబ్బులు సేకరించి మోసానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Indane Gas New Booking Numbers: ఇండేన్ గ్యాస్ కొత్త బుకింగ్ నంబర్లు ఇవే!

ఒక్క ఆదిలాబాద్‌లోనే 12 కేసుల్లో సుమారు రూ.1.11 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు, అతని నుంచి ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతని ఆస్తులను కూడా చట్టప్రకారం జప్తు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: