हिन्दी | Epaper

సజ్జల డైరెక్షన్‌లోనే పవన్, లోకేశ్‌ను తిట్టా : పోసాని

sumalatha chinthakayala
సజ్జల డైరెక్షన్‌లోనే పవన్, లోకేశ్‌ను తిట్టా : పోసాని

ఆయన చెప్పినట్లే ప్రెస్‌మీట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా

హైదరాబాద్‌: వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారమే ప్రెస్‌మీట్లు, ప్రసంగాల్లో తాను అసభ్య దూషణలు, రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి అంగీకరించారు. వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసేవారని చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలిగించాలనే కుట్రతోనే వారితో కుమ్మక్కై ప్రెస్‌మీట్లలో ఈ వ్యాఖ్యలు చేశానని వివరించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టైన పోసాని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరిస్తూ… నేరాంగీకారపత్రంపై సంతకం చేశారు.

సజ్జల డైరెక్షన్‌లోనే పవన్  లోకేశ్‌ను

ప్రతి ప్రెస్‌మీట్‌కు ముందు ఆయన నాకు స్క్రిప్ట్‌ పంపేవారు

పోలీసులు కోర్టులో సమర్పించిన నేరాంగీకారపత్రంలోని ప్రధానాంశాలివీ.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఆయన భార్య, పిల్లల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడాను. ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టాను. రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా వ్యాఖ్యానించాను. మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశా. అశ్లీల పదజాలంతో మహిళలనూ దూషించాను. వీరందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డే. ప్రతి ప్రెస్‌మీట్‌కు ముందు ఆయన నాకు స్క్రిప్ట్‌ పంపేవారు. ఆయన అనుమతితోనే రెచ్చగొట్టేలా మాట్లాడేవాణ్ని అన్నారు.

వారితో కుమ్మక్కై, వారి ప్రోద్బలంతోనే కులాల మధ్య చిచ్చు

2014 నుంచి నేను వైసీపీకీ మద్దతుదారును. రాజకీయంగా, సామాజిక మాధ్యమాల్లో ఆ వర్గాలతో కలిసి పనిచేస్తున్నా. వారితో కుమ్మక్కై, వారి ప్రోద్బలంతోనే కులాల మధ్య చిచ్చుపెట్టేలా, ప్రజల్ని రెచ్చగొట్టి, గొడవలు సృష్టించేలా ప్రెస్‌మీట్లలో కుట్రపూరిత వ్యాఖ్యలు చేశా. చంద్రబాబు హయాంలో నంది అవార్డుల ఎంపిక కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 11 మంది ఒకే కులానికి చెందినవారేనంటూ అసత్య ప్రచారం చేసి నంది అవార్డు తిరస్కరించా. సినీ పరిశ్రమలో కొన్ని కులాల ఆధిపత్యం ఉందంటూ.. ఓ కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాను. సినీ అభిమానులు, రాజకీయ పార్టీలు, కులాల మధ్య విభేదాలు తలెత్తాలనే ఇలా మాట్లాడాను అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870