ఇటీవల తెలంగాణలో పారాక్వాట్ అనే ప్రమాదకర గడ్డిమందు వినియోగం పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. పంటల్లో పెరిగే కలుపు మొక్కలను కొద్ది గంటల్లోనే పూర్తిగా మాడిపోయేలా చేసే ప్రభావంతో ఇది రైతుల్లో విస్తృతంగా ఉపయోగంలో ఉంది. ఒకవైపు పంటలకు ఉపయోగపడుతున్నా, మరోవైపు ఈ మందును తాగి ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు పెరగడం తీవ్ర విషాదకరం. వ్యవసాయ రంగంలో విస్తృతంగా లభిస్తున్నందున ఇది సులభంగా అందుబాటులో ఉండటం ప్రమాదాన్ని మరింత పెంచుతోంది.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 28 అక్టోబర్ 2025 Horoscope in Telugu
పారాక్వాట్ విషతత్వం అత్యంత ఘోరం. ఇది శరీరంలోకి చేరిన కొద్ది నిమిషాల్లోనే రక్త ప్రసరణ ద్వారా కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషానికి ఇప్పటి వరకు విరుగుడు (అంటీడోట్) లేనందున బాధితులను కాపాడే అవకాశాలు చాలా తక్కువ. వైద్యులు తెలిపిన దాని ప్రకారం, 98% వరకు కేసుల్లో మరణశాతం నమోదవుతోంది. బాధితులు తీవ్ర వేదనతో మరణించడం, కుటుంబాలకు తిరుగులేని నష్టాన్ని మిగిల్చడం జరుగుతోంది.

ఇప్పటికే కేరళ, ఒడిశా సహా ప్రపంచంలోని 32 దేశాలు పారాక్వాట్ విక్రయం, వినియోగాన్ని నిషేధించాయి. మన రాష్ట్రంలో కూడా రైతులు, వ్యవసాయ నిపుణులు, ప్రజా సంఘాలు ఈ విష గడ్డిమందుపై బ్యాన్ విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పంటలకు ప్రత్యామ్నాయ పద్ధతులు, తక్కువ విషతత్వం ఉన్న మందులను ప్రోత్సహించడం అత్యవసరం. రైతుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ విష చక్రాన్ని ఆపాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వ విధానాలు, సామాజిక బాధ్యత కలిసివస్తేనే ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ రసాయనంపై పూర్తి నియంత్రణ సాధ్యమవుతుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/