తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) వేళ ఆసన్నమైనట్లు తెలుస్తుంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఈ ఎన్నికలు వచ్చే జూలై లేదా ఆగస్టు నెలల్లో (July or August) నిర్వహించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఈ దిశగా సంబంధిత అధికారులు ప్రాథమిక స్థాయిలో ప్రక్రియలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి
ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, భూభారతి వంటి పథకాల అమలు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించిందని భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాల ప్రభావం బలంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే, ప్రజల్లో ఉన్న సానుకూల భావనను ఎన్నికల రూపంలో ఫలితంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం.
బిఆర్ఎస్ , బిజెపికి ఈ ఎన్నికలు కీలకం
ఇక భవిష్యత్తు దృష్ట్యా ఈ ఎన్నికలు ప్రతిపక్షాలకూ కీలకంగా మారాయి. పునరుద్ధరణ దశలో ఉన్న బీఆర్ఎస్, పునర్వ్యాఖ్యానాన్ని తలపెట్టిన బీజేపీ, అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక స్థాయిలో తమ బలాన్ని అంచనా వేసుకునే ఈ ఎన్నికలను టెస్ట్‌గా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ వేడి మళ్ళీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also : Pak : పాకిస్థాన్‌తో గూఢచర్యం.. మరో యూట్యూబర్ అరెస్ట్..!