స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిన్న హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో గల ఉద్యానవనాన్ని సందర్శించినట్టు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. క్షేత్ర పర్యటనలో భాగంగా బిఎస్సి. బి జెడ్ సి ఎస్ మరియు బి జెడ్ సి . డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులు సుమారు 55 మంది పాల్గొన్నట్టు తెలిపారు. వృక్షశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ నాగేందర్రావు గారి నేతృత్వంలో బయలుదేరిన ఈ బృందం హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో గల ఉద్యానవనాన్ని సందర్శించి, అక్కడ గల వివిధ రకాల పుష్పాలను, వాటి గురించి విద్యార్థులకు పరిచయం చేసినట్టు తెలిపారు. ఈ నెల మూడవ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్సవాల సందర్భంగా ఈ క్షేత్ర పర్యటన ను నిర్వహించినట్టు తెలిపారు.
Read Also: Telangana: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్

ఈ ఉత్సవాలను రాష్ట్రంలోని విద్యార్థులందరూ సందర్శించవచ్చు. ఈ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతి కి విద్యార్థులను దగ్గరగా తీసుకెళ్లడం, ఉత్సాహభరితమైన వాతావరణం విద్యార్థులకు అందించి మనోవికాసానికి దోహదం చేయడం అలాగే పచ్చని వాతావరణం భూమిని ఎంతటి ఆహ్లాదంగా మారుస్తుందో అవగాహన కలిగించి సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. వృక్షశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ మన దేశానికి వెన్నుముక అయిన వ్యవసాయాన్ని మరింత సుస్థిరమైన దిశగా మార్చడానికి నూతన ఆవిష్కరణలు అన్వేషించడంలో విద్యార్థులను ప్రోత్సహించారు.
ఆ తరువాత అక్కడినుండి ఉస్మానియా విశ్వవిద్యాలయము(OU) లోని ఆర్ట్స్ కళాశాల మరియు లైబ్రరీని కూడా సందర్శించినట్టు తెలిపారు. డిగ్రీ చదువులు పూర్తయిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో(OU) లభించే పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను, వివిధ విభాగాలను విద్యార్థులతో కలిసి సందర్శించారు. ఆపిదప విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని సందర్శించి కాంపిటేటివ్ పరీక్షల పట్ల అవగాహన కలిగించడం జరిగిందని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పైలాన్ ను కూడా సందర్శించారు.ఈ క్షేత్ర పర్యటనలో డాక్టర్ తిరుమలరెడ్డి, డాక్టర్ రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: