हिन्दी | Epaper

Telangana: 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Tejaswini Y
Telangana: 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Telangana : ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణలోని వామ 5 పక్షాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు 3 లేబర్కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ – చట్టం- 2025, వీబీజి రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐసీలో 100శాతం విదేశీ పెట్టు బడులకు అనుమతించడం వంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ – చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 12న – జరుప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు – వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దత్తును 5 తెలియజేశాయి.

Read Also: Telangana: 3 రోజులు లిక్కర్ షాపులు బంద్?

Telangana: The nationwide strike on the 12th should be made a success
Telangana: The nationwide strike on the 12th should be made a success

ప్రజలు, కార్మికులకు తెలంగాణ వామపక్షాల పిలుపు

రాష్ట్రంలోని కార్మికులు, ప్రజలు – ఈ సమ్మెలో పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు లాభం చేకూర్చేలా ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను(Labour Codes) కేంద్రం తీసుకొచ్చిందని, వాటి వల్ల కార్మికులు ఇఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సామాజిక భద్రతకు దూరమవుతారని వామపక్షాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ల మూలంగా ఉద్యోగ భద్రత ఉండదని, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కార్మికుల పనిగంటలు పెంచుతూ చట్ట సవరణ జరిగిందని గుర్తు చేశారు. అలాగే వీబీజి రామ్ జీ చట్టం తెచ్చి కేంద్రం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందన్నారు. బడ్జెట్లో కేటాయింపుల తగ్గింపు, పని రోజులు తగిస్తోందని మండిపడానడరు. విద్యుత్ సవరణ బిల్లు వల్ల సామాన్యులకు విద్యుత్ చార్జీలు పెరుగుతాయని, స్మార్ట్ మీటర్లు, క్రాస్ సబ్సిడీ రద్దుతో రైతులు, పేదలకిచ్చే ఉచిత విద్యుత్ తోపాటు సబ్సిడీ విద్యుత్ ప్రమాదంలో పడుతుందన్నారు.

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. విద్యుత్ ఛార్జీలతోపాటు కీలక విషయాల నిర్ణయాల్లో రాష్ట్రాల అధికారాలు తగ్గించి తన పట్టును పెంచుకుంటుందని, విత్తన సవరణ బిల్లు వల్ల విత్తనాల ధరలను నియంత్రించే అధికారం ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిందని, బహుళజాతి కంపెనీల పట్టు పెరుగుతుండటంతోపాటు సాగు ఖర్చు భారీగా పెరుగుతుందన్నారు. ఎల్ఎసిలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వల్ల విదేశీ కంపెనీలు కేవలం లాభాపేక్షతో పని చేస్తాయని, క్లెయిమ్ల విషయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. ప్రజల సొమ్మును మన దేశ అభివృద్ధికి కాకుండా విదేశీ కంపెనీల లాభాలకు మళ్ళిస్తారని విమర్శించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీల సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు వామపక్ష పార్టీల నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

ప్రియురాలి కాబోయే భర్తను గొడ్డలితో చంపిన ఉన్మాది!

ప్రియురాలి కాబోయే భర్తను గొడ్డలితో చంపిన ఉన్మాది!

భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య!

భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య!

శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

మళ్ళీ మైదానంలోకి హర్భజన్ సింగ్

మళ్ళీ మైదానంలోకి హర్భజన్ సింగ్

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

📢 For Advertisement Booking: 98481 12870