
Nallamala Forest Fire: తెలంగాణలోని, నాగర్కర్నూల్ జిల్లాలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని తాటి గుండాల సెక్షన్లో మంటలు చెలరేగాయి. మంటలు మొదలై 24 గంటలు గడుస్తున్నా.. అదుపులోకి రాలేదు. వేగంగా వీస్తున్న గాలులు, ఎండిన గడ్డి కారణంగా నిప్పు సెగలు అడవి అంతటా విస్తరిస్తున్నాయి.30 మందికి పైగా అటవీ శాఖ సిబ్బంది, టైగర్ ట్రాకర్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Read Also: Telangana: టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!
వందల హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతి – వన్యప్రాణుల విలవిల
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో గడ్డి ఆవాసాలు ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే వందల హెక్టార్ల అటవీ సంపద కాలి బూడిదైనట్లు ప్రాథమిక అంచనా. అడవిలో మంటలు ఎగిసిపడుతుండటంతో అరుదైన చెట్లు కాలిపోయాయి, వన్యప్రాణులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. పర్యావరణానికి ఈ ప్రమాదం వల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: