Nalgonda Municipal Election Results: నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం ఆరు మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుని, తిరుగులేని శక్తిగా అవతరించింది. చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, మరియు నందికొండ పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు – 2026
| మున్సిపాలిటీ పేరు | మొత్తం వార్డులు | కాంగ్రెస్ గెలిచిన వార్డులు |
| హాలియా | 12 | 11 |
| నందికొండ | 12 | 11 |
| చిట్యాల | 12 | 9 |
| మిర్యాలగూడ | 48 | 31 |
| చండూరు | 10 | 6 |
| దేవరకొండ | 20 | 10 |
చండూరులో 10కి 6, చిట్యాలలో 12కి 9, దేవరకొండలో 20కి 10, హాలియాలో 12కి 11, మిర్యాలగూడలో 48కి 31, నందికొండలో 12కి 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యాన్ని అందించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: