हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Nagarkurnool: మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

Saritha
Nagarkurnool: మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసు అనూహ్య మలుపు తిరిగింది. తోటి విద్యార్థి వల్లే గర్భం దాల్చానని చెప్పి అసలు నిందితుడిని కాపాడాలనుకున్న బాలిక పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.

నాగర్‌కర్నూల్‌లోని ఓ కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని నిన్న ఓ స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, పదో తరగతి పరీక్షల సమయంలో పరిచయమైన ఓ బాలుడి వల్లే తాను గర్భవతిని అయ్యానని బాలిక తెలిపింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు బాలికతో పరిచయం, చాటింగ్ ఉన్న మాట వాస్తవమే కానీ, అంతకుమించి మరేమీ లేదని బాలుడు స్పష్టం చేశాడు.

Read Also: Kalvakuntla Kavitha: తిరుమలకు బయలుదేరిన కవిత 

Nagarkurnool: మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం
Nagarkurnool: Minor girl gives birth…attempt to implicate fellow student

డీఎన్ఏ పరీక్ష హెచ్చరికతో బయటపడ్డ నిజాం

పోలీసులకు అనుమానం వచ్చి, బాలికను మరోసారి విచారించారు. నిజానిజాలు తేల్చడానికి శిశువుకు, బాలుడికి డీఎన్ఏ (DNA) నిర్వహిస్తామని, ఒకవేళ అది అబద్ధమని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. డీఎన్ఏ పరీక్ష అంటే భయపడిన బాలిక, తాను అబద్ధం చెప్పానని అంగీకరించింది. ఇంటి సమీపంలో నివసించే వివాహితుడైన బంధువే తన గర్భానికి కారణమని ఒప్పుకుంది. వెంటనే పోలీసులు ఆ వివాహితుడిని అదుపులోకి తీసుకోగా, అతడు కూడా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870