స్నేహితులే ప్రాణం తీసిన దారుణం
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి అమ్ముతున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడన్న నెపంతో ముగ్గురు యువకులు తమ స్నేహితుడినే కిరాతకంగా హత్య చేశారు. ప్రణీత్ అనే యువకుడిని పక్కా ప్లాన్‌తో బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో చితకబాది అక్కడే వదిలిపెట్టారు. గాయాలపాలైన ప్రణీత్‌ను కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్‌కు తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో యాప్రాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బాధితుడి కుటుంబ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది.
డ్రైవర్‌గా పనిచేస్తూ జీవించిన ప్రణీత్
మేడ్చల్ జిల్లా యాప్రాల్ భగత్‌సింగ్ కాలనీలో నివాసముండే పుల్లూరి ప్రణీత్ ఒక ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. సమీప ప్రాంతంలోనే నివసించే రాజా గోవర్ధన్, సూర్యచరణ్, రామకృష్ణలతో ప్రణీత్‌కు సన్నిహిత అనుబంధం ఏర్పడింది. వీరంతా చిన్ననాటి నుంచే స్నేహితులుగా కలిసి తిరిగేవారు. సమయాన్ని కలిసి గడిపేవారు, గడిచిన సంవత్సరాలుగా వారి మధ్య స్నేహబంధం బలంగా కొనసాగింది. వీరందరూ ఒకే కాలనీకి చెందినవారిగా తరచూ సమావేశమవుతూ ఆనందంగా సమయం గడిపేవారు. ఈ స్నేహం క్రమంగా మలినమై దుర్మార్గంగా మారడంతో విషాదాం చోటు చేసుకుంది.
తప్పుడు ప్రచారమే కారణం
గంజాయి అమ్ముతున్నారని గోవర్ధన్, జశ్వంత్‌లపై ప్రణీత్ తన స్నేహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన గోవర్ధన్, జశ్వంత్ తీవ్రంగా ఆగ్రహించారు. తమపై ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని భావించిన వారు, ప్రణీత్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతనిపై దాడి చేయాలని ముందుగానే ప్లాన్ వేసి, రామకృష్ణ సహాయంతో స్కూల్ వద్దకు తీసుకెళ్లి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తీవ్రంగా చితకబాదారు. ఇదే దాడి ప్రణీత్ ప్రాణాలు తీసింది.
ప్రణీత్‌ను ఉద్దేశపూర్వకంగా ఎత్తుకెళ్లి దాడి
ఈ నెల 5వ తేదీ సాయంత్రం రామకృష్ణ, ప్రణీత్ ఇంటికి వెళ్లి బయటకి సరదాగా వెళ్లి వచ్చెదాం అని తీసుకెళ్లాడు. ఓ స్కూల్ వద్ద తీసుకెళ్లిన తర్వాత ముందుగానే అక్కడ వేచి ఉన్న గోవర్ధన్, జశ్వంత్ కలిసి ప్రణీత్‌ను బలవంతంగా బైక్‌పై ఎక్కించి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని “తప్పుడు ప్రచారం చేస్తావా?” అంటూ తీవ్రంగా చితకబాదారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ అపస్మారక స్థితిలోకి పడిపోయాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ప్రణీత్‌ను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. అతడిని గాయాలపాలైన స్థితిలో గమనించిన స్థానికులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రణీత్‌కు ప్రథమ చికిత్స తర్వాత గాంధీ హాస్పిటల్‌కు తరలించినా పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందాడు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల అరెస్ట్
ఈ సంఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన గోవర్ధన్, జశ్వంత్, రామకృష్ణలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు మరింత విచారణ చేపట్టారు.
READ ALSO: Rape: మైనర్ బాలికపై హత్యాచారం