हिन्दी | Epaper

Telangana Ippa Sara: ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Siva Prasad
Telangana Ippa Sara: ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Telangana Ippa Sara: రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని, అడవుల్లో సహజంగా దొరికే ఇప్పపూలతో తయారు చేసే సారాను ప్రమోట్ చేయాలని మాత్రమే కోరుతున్నానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేసారు. ఇప్పపూలతో తయారు చేసే సారాతో తెలంగాణ బ్రాండ్ ను క్రియేట్ చేయాలని, తద్వారా అటు ప్రభుత్వానికీ ఇటు ఆదివాసీ, గిరిజనులకు కూడా భారీ ఎత్తున ఆదాయం వచ్చేలా చూడాలని తాను ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఇప్పపూల సారా అనేది తన వ్యక్తిగత ఆలోచన అని, కేవలం తాను గిరిజనుల కోసమే దీని గురించి అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని వివరించారు.

Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు

చారిత్రక నేపథ్యం మరియు ఆరోగ్య అంశాలు

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనిరుధ్ రెడ్డి తాను సారాపై చేసిన వాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇప్పపూలతో సారా తయారు చేయడం అనేది 5వేల ఏళ్ల క్రితం నుంచే మన దేశంలో ఉందని, అయితే బ్రిటీష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వారు తయారు చేసే మద్యాన్ని అమ్ముకోవడానికి ఇప్పసారా తయారీని బంద్ చేయించారని చెప్పారు. గతంలో ఇప్పసారా తాగిన వాళ్లు 115 ఏళ్ల వరకూ బతికే వారని, అయితే ఇప్పుడు తాగుతున్న మద్యం కారణంగా 60 ఏళ్లకే మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ఎంతో పరిశోధన చేసిన తర్వాతనే ఈ విషయాలపై మాట్లాడుతున్నానని తెలిపారు.

Telangana Ippa Sara: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ మరియు ఆర్థిక లాభాలు

విదేశాల్లో మన ఇప్పపూల తరహాలోనే తయారు చేసి టకీలా అనే సారా ద్వారా దాన్ని తయారు చేసే దేశం లక్ష కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోందని, అలాగే చైనా, జపాన్ లు కూడా తమ సాంప్రదాయపు మద్యాన్ని తయారు చేసి ప్రప్రంచ వ్యాప్తంగా అమ్ముతున్నాయని అన్నారు. అదే విధంగా సాంప్రదాయకమైన ఇప్పసారా ను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రమోట్ చేయడం ద్వారా మన రాష్ట్రానికి కూడా లక్ష కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాలని, దాని ద్వారా ఆదివాసీ, గిరిజనులు కూడా ప్రతి యేటా లక్షల రుపాయల ఆదాయాన్ని సంపాదించుకోవాలన్నదే తన లక్ష్యమని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల తో సహా అటవీ ప్రాంతాల్లో ఇప్పపూలు విస్తారంగా లభిస్తాయని వాటిని సేకరించడం ద్వారా ఆదివాసీ బిడ్డలకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పసారాకు ప్రపంచ వ్యాప్తంగా ఒక గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ ను తీసుకురావాలన్నదే తన ఆలోచన అని అనిరుధ్ రెడ్డి చెప్పారు.

బెల్టుషాపుల సమస్య మరియు సాంకేతిక లొసుగులు

అయితే రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని ఆయన స్పష్టం చేసారు. చీఫ్ లిక్కర్ గురించి కూడా మాట్లాడబోనన్నారు. బెల్టుషాపులను అరికట్టడంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, తాను కూడా గతంలో తన నియోజకవర్గంలో వాటిని పూర్తిగా అరికడతానని హామీ ఇచ్చానని, అయితే నిబంధనల ప్రకారంగా 7బాటిళ్ల కంటే తక్కువ మద్యం ఉన్నప్పుడు వాటిని పట్టుకొని కేసు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఈ లొసుగు ఆధారంగా బెల్టుషాపుల్లో 6బాటిళ్ల కంటే తక్కువ మద్యాన్ని పెట్టుకొని అమ్ముకుంటున్నారని వాపోయారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఇప్పసారా అని అభిప్రాయపడ్డారు.

Telangana Ippa Sara: సొంత ఆలోచన మరియు మీడియా ప్రచారంపై స్పందన

ఇప్పసారాను ప్రమోట్ చేయాలన్నది గిరిజనులు, ఆదివాసీలకు ఉపాధి కల్పించాలనే తన సొంత ఆలోచన మాత్రమేనని విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా ఎమ్మెల్యే స్పష్టీకరించారు. ఇప్పసారాతో లాభాలు ఉన్నాయని, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని వీటన్నింటిని గురించి తాను అసెంబ్లీలో మాట్లాడుతానని ఈ విషయంలో తప్పొప్పులు ఏమైనా ఉంటే అసెంబ్లీలోనే సరిదిద్దుకుంటానని అనిరుధ్ అన్నారు. తాను ఇప్పసారా గురించి మాత్రమే మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు వాటికి మసాలాలు జోడించి తాను సారా ప్రభుత్వమే అమ్మాలని, సారా దుకాణాలు మళ్లీ తెరవాలని చెప్పినట్లుగా ప్రచారం చేసాయని వాటిలో వాస్తవం లేదని స్పష్టం చేసారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870