హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో ఉన్న రఫా పునరావాస కేంద్రం(Rafah Rehabilitation Center)లో నిన్న రాత్రి ఘోర హత్య జరిగింది. డ్రగ్ డీ-అడిక్షన్ చికిత్స కోసం అక్కడే ఉండే సందీప్ అనే వ్యక్తి కొంతమంది సహచికిత్సార్ధులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు పిడుగురాళ్లకు చెందిన సందీప్
హతుడైన సందీప్ (Sandeep)(వయసు 39) పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందినవాడు. గత ఎనిమిదేండ్లుగా అతను డ్రగ్ వ్యసనం నుంచి బయటపడేందుకు రఫా డీ-అడిక్షన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు.
గొడవగా మొదలై హత్యగా ముగిసిన ఘటన
నల్గొండకు చెందిన ఆదిల్, బార్సాస్ ప్రాంతానికి చెందిన సులేమాన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అదే కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. మాదకద్రవ్యాలకు బానిసలైన ఈ ముగ్గురి మధ్య వ్యక్తిగత అభిప్రాయ భేదాలు తలెత్తి బుధవారం రాత్రి ఘర్షణకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గొడవ ఉద్రిక్తతకు దారి తీసి, ఆదిల్, సులేమాన్ కలిసి సందీప్‌పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
కేసు నమోదు – నిందితులు పోలీసుల అదుపులో
ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: