ప్రపంచ అందాల పోటీ మిస్ వరల్డ్-2025 (Miss World 2025) తుది దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ పోటీలు ( Finals ) రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు పాల్గొన్న ఈ పోటీ చివరి ఘట్టానికి చేరడంతో అందరి దృష్టి ఇప్పుడు ఫైనల్స్‌పైనే ఉంది.
జడ్జిలగా ప్రముఖులు
ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా పలువురు ప్రముఖులు వ్యవహరించనున్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ జడ్జిలుగా ఎంపికయ్యారు. అందగత్తెల నైపుణ్యం, అందం, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర అంశాలను పరిశీలించి, విజేతను నిర్ణయించనున్నారు.
వినోదానికి హంగుగా స్టార్స్ షో
ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తమ డాన్స్ పర్ఫార్మెన్స్‌లతో వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే ఫైనల్లోకి ఎంపికైన టాప్-3 అందగత్తెల్లో ఒకరిని మిస్ వరల్డ్-2025గా ప్రకటించనున్నారు. హైదరాబాద్ వేదికగా ఇంత గొప్ప అంతర్జాతీయ ఈవెంట్ జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.
Read Also : Chandrababu Naidu : రాష్ట్రం నుంచి తరిమికొడదాం : చంద్రబాబు