నల్గొండ(Miryalaguda) జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జ్వరంతో బాధపడుతున్న కుమారుడికి మందు ఇచ్చిన తల్లి, పొరపాటున తాగునీరు అనుకుని ప్రమాదకర రసాయనాన్ని తాగించడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Also: Mumbai crime: కొడుకు కావాలని కన్నకూతురిని చంపిన తల్లి

జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరిన విద్యార్థి
వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన సత్యనారాయణ–రామలింగమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు గణేష్ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల రెండు రోజులుగా జ్వరం రావడంతో అతడిని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొచ్చారు.
శనివారం ఉదయం గణేష్‌ను మిర్యాలగూడలోని(Miryalaguda) ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్య సిబ్బంది పారాసిటమాల్ మాత్ర ఇవ్వాలని సూచించారు. తల్లి మందు ఇచ్చిన అనంతరం తాగునీరు కోసం చూడగా సమీపంలో నీరు అందుబాటులో లేకపోవడంతో పక్కనే ఉన్న ల్యాబ్ గదిలోకి వెళ్లింది. అక్కడ ఉన్న క్యానులోని ద్రవాన్ని నీరేనని భావించి బాటిల్‌లో నింపి కుమారుడికి తాగించింది.
ఫార్మాల్డిబైడ్ తాగడంతో వెంటనే అస్వస్థత
అయితే ఆ ద్రవం తాగునీరు కాకుండా ఫార్మాల్డిబైడ్ అనే ప్రమాదకర రసాయనం అని తేలింది. రెండు గుటకలు తాగిన వెంటనే గణేష్ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
ఆస్పత్రిలో తాగునీరు ఏర్పాటు చేయకపోవడం, ప్రమాదకర కెమికల్‌ను ఎలాంటి హెచ్చరికలు లేకుండా ల్యాబ్‌లో ఉంచడమే ఈ దుర్ఘటనకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: