అసెంబ్లీ హాల్లో మేఘాలయ బృందానికి (Meghalaya Team) హృదయపూర్వక స్వాగతం
హైదరాబాద్: మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యేల బృందం (Meghalaya Team) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ కమిటీ హాల్లో మేఘాలయ రాష్ట్ర బృందానికి పిఎసి చైర్మన్ ఆర్కేపూడి గాంధీతో కలిసి మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) స్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమై తెలంగాణ, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల గురించి సభ్యులకు వివరించారు. అసెంబ్లీ నిర్వహించే విధానంతో పాటు, అసెంబ్లీ లో ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేసే చట్టాలను రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వారికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే (Mahabubnagar MLA) యెన్నం శ్రీనివాస్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్రం ఉద్దేశ్యాలను, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఔన్నత్యం గురించి మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందానికి ఆయన వివరించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో “విద్యా నిధి” ఏర్పాటు, మహబూబ్ నగర్ ఫస్ట్ లక్ష్యాలను, నిరుద్యోగ యువతకు ఇచ్చే ఉచిత కోచింగ్, నైపుణ్య శిక్షణ సెంటర్ గురించి కూడా వారికి వివరించారు. ఈ సందర్భంగా మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందం అసెంబ్లీ సమావేశాల గురించి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి, మహబూబ్ నగర్ విద్యా నిధి గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చార్లెస్ పిన్రోప్, ఎమ్మెల్యేలులహెన్ రింబుల్, రూపా లీ. మార్క్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
మేఘాలయ రాష్ట్ర బృందం తెలంగాణ అసెంబ్లీకి ఎందుకు వచ్చారు?
అసెంబ్లీ కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను తెలుసుకోవడానికే వారు తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు.
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఏమి వివరించారు?
ఆయన విద్యా నిధి, ఉచిత కోచింగ్, నైపుణ్య శిక్షణ కేంద్రాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: R. Krishnaiah: ఫీజు బకాయిలు చెల్లించండి