మాఘ అమావాస్య సందర్భంగా, మెదక్ జిల్లా (Medak) అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ గారు ఏడుపాయల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రదేశాలు, భక్తులు ఉపయోగించే క్యూలైన్‌ల నిర్వహణను సమీక్షించారు. మొత్తం బొందొబస్త్ సుమారు 250 మంది సిబ్బందితో ఏర్పాటు చేయబడిందని తెలిపారు.నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి, భక్తులు తెలియని లోతట్టు ప్రదేశాలకు వెళ్లకూడదని, పోలీసులు సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే స్నానాలు చేయాలని స్పష్టం చేశారు.
Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇంకెంత కాలం విచారిస్తారన్న సుప్రీంకోర్టు

అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా అమలు చేయాలి
అదేవిధంగా, దేవాలయం ప్రాంగణంలో భక్తులు దర్శించుకునే క్యూలైన్‌లను పరిశీలించారు. భక్తులు స్నానం చేసే ప్రమాదకర ప్రాంతాలను సూచించే విధంగా సూచికలను ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా అమలు చేయాలని అదనపు ఎస్పీ గారు అధికారులకు సూచించారు.ఈ సందర్బంగా అదనపు ఎస్పీ గారి వెంట మెదక్ రూరల్ సీఐ జర్జ్, కూల్చారం ఎసై అహ్మద్ మోహినొద్దీన్ ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: