Medak Municipal Elections: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికల సంఘం నియమాలను పాటించాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం రామాయంపేటలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డిఓ రమాదేవి(RDO Ramadevi)తో కలిసి పరిశీలించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లను సమగ్రంగా పరిశీలించారు.
Read also: TG: సర్కార్ కీలక నిర్ణయం.. ధరణి పోర్టల్ డెడ్‌లైన్ పొడిగింపు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచనున్న బ్యాలెట్ పేపర్ల యొక్క భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, మూడు అంచెల భద్రత, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కౌంటింగ్ హాల్‌లో(counting hall) టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది కూర్చునే విధానం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఓట్ల లెక్కింపు పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: