Maoist Surrender: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో జరగనుంది.
Read Also:Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

పోలీసులు మరియు కేంద్ర భద్రతా బలగాలు చాలా కాలంగా వెతుకుతున్న పలువురు మావోయిస్టులు ఇందులో భాగమవుతారని తెలుస్తోంది. మొత్తం 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోనుండగా, వారిలో కొందరు కీలక నాయకుల అనుచరులు మరియు గన్‌మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం.
గణపతి ఉంటారా? అన్న ఉత్కంఠ
ఇటీవలే సరెండర్ అయిన దేవ్ జి కు చెందిన గన్‌మెన్లు, అనుచరులు కూడా ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. అయితే మావోయిస్టు ఉద్యమంలోని కీలక నేతముప్పాళ్ల లక్ష్మణ రావు (గణపతి) కూడా వీరిలో ఉంటారా? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ లొంగుబాటు కార్యక్రమం తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందా? అనే విషయంపై రాజకీయ మరియు భద్రతా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: