हिन्दी | Epaper

Mahesh Kumar Goud: కెటిఆర్ నిజాలు చెప్పాలి

Tejaswini Y
Mahesh Kumar Goud: కెటిఆర్ నిజాలు చెప్పాలి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్(KTR) చేస్తున్న విమర్శలపై పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఘాటుగా స్పందించారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఆయన… వ్యక్తిగత హననం జరుగుతోందని కెటిఆర్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిధిలోనే విచారణ సాగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెటిఆర్ ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్

Mahesh Kumar Goud: KTR should tell the truth.
Mahesh Kumar Goud: KTR should tell the truth.

సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం

ఇద్దరి మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అన్నారు. కెటిఆర్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కుటుంబం అలీబాబా 420 దొంగల మాదిరిగా దోపిడీకి పాల్పడిందని మహేశ్ గౌడ్ తీవ్రవిమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ స్టువర్ట్ పురం దొంగల బ్యాచా మారిం దన్నారు. ఆరనీకుమా ఈకార్తీకదీపం అనే ముందు, మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ దీపం ఆరిపో కుండా చూసుకోవాలని సెటైర్లువేశారు. ఫోన్ ట్యాపింగ్పై కెటిఆర్ మాట్లాడటం పూర్తిగా హాస్యా స్పదమన్నారు.

ద్యమ కేసులతో పోల్చడం సరికాదని స్పష్టం

తోడబుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలాతీవ్రమైనదని, దీనిని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. అధికారులకు కూడా పరిమితులు ఉంటాయని
అన్నారు. కాళేశ్వరం అవినీతి పై కెసిఆర్ కుటుం బంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ను తాను నేరుగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అలాగే బిజెపి నేతలపై ఉన్న ఇడి కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ కీలక ప్రశ్న లేవనెత్తారు. దేశ భద్రతకు ముప్పుగా మారే శక్తులపై మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరుగు తుందని, అలాంటప్పుడు సినిమావాళ్లఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నక్సలైట్లతో లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానంతో తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. కెసిఆర్ కుటుంబంలో తగాదాలకు అసలు కారణం వాటాల పంపకంలో తేడాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ పాలనలో కేవలం మూడు నెలల్లోనే 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. తన మిత్రుడి ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

సీఏ ఫలితాల విడుదల

సీఏ ఫలితాల విడుదల

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

📢 For Advertisement Booking: 98481 12870