మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాలోని మహిళలు, పిల్లలపై నేరాల ప్రత్యేక న్యాయస్థానం లో న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి బుధవారం కీలక తీర్పు వెలువరించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన చిట్లపల్లి సతయ్య, తండ్రి రాములు, వయస్సు 47 సంవత్సరాలు, వృత్తి వ్యవసాయం అనే నిందితుడు, గత ఏడాది మే 23న మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు నేరం రుజువుకావడంతో, న్యాయస్థానం అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000/ జరిమానా విధించింది.
Medak News : మెదక్‌లో మెడికల్ అసోసియేషన్ నూతన భవనానికి భూమిపూజ , ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

బాలికకు రూ.5,00,000/ పరిహారం
అలాగే బాధిత బాలికకు రూ.5,00,000/ (ఐదు లక్షల రూపాయలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో మొత్తం 8 మంది సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి వాదనలు వినిపించగా, అప్పటి భూత్పూర్ ఎస్ఐ బాస్కర్ రెడ్డి కేసు నమోదు చేయగా, భూత్పూర్ సీఐ రజిత రెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్ దాఖలు(Chargesheet filed) చేశారు. ప్రస్తుతం భూత్పూర్ సీఐగా ఉన్న రామకృష్ణ పర్యవేక్షణలో కోర్టు లైజన్ ఆఫీసర్ చంద్రశేఖర్, పీసీ అరవింద్, ఏఎస్ఐఐ బాలకృష్ణ లు సాక్షులను కోర్టులో హాజరుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కేసు విజయవంతంగా ముగియడానికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని మరియు న్యాయశాఖ అధికారులను జిల్లా ఎస్పీ డి.జానకి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు తప్పవని, మహిళలు బాలల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: