हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Maganti Gopinath: నేడు మధ్యాహ్నం మాగంటి అంత్యక్రియలు..ప్రముఖుల సంతాపం

Sharanya
Maganti Gopinath: నేడు మధ్యాహ్నం మాగంటి అంత్యక్రియలు..ప్రముఖుల సంతాపం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన ఇది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న బీఆర్‌ఎస్‌ నేత మాగంటి గోపీనాథ్‌ అనారోగ్యానికి గురై 2025 జూన్ 8వ తేదీ, ఆదివారం ఉదయం 5:45కు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత గురువారం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్‌కు మొదటిసారి CPR చేసి గుండె స్పందన తిరిగి తీసుకొచ్చినప్పటికీ, అప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్నారు. మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుఝామున మరణించారు.

మధ్యాహ్నం అంత్యక్రియలు – మహాప్రస్థానంలో

మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. మాగంటి గోపీనాథ్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబానికి, సమాజానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

రాజకీయ ప్రస్థానం

మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు యువత నేతగా, హైదరాబాద్ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

  • 2014లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ తరపున గెలిచారు.
  • 2018లో బీఆర్‌ఎస్‌లో చేరి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
  • 2023లోనూ బీఆర్ఎస్ తరపున గెలిచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా నిలిచారు.

అందులో ప్రతి విజయం ఆయన ప్రజల పట్ల నిబద్ధతకు నిదర్శనమని అనేక నేతలు కొనియాడారు.

ప్రముఖుల సంతాపం – రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి

మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశం పంపించారు. జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం.3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిసున్నా. మాగంటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు గుండెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా మారారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Read also: Chandrababu: మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870