హైదరాబాద్ : నష్టాల్లో ఉన్న తెలంగాణలోని మదర్ డెయిరీని (Mother Dairy) గట్టెక్కించే ప్రయత్నం చేస్తామని డెయిరీ ఛైర్మన్ గుడిపాడి మధుసూధన్ (Madhusudhan Reddy) వెల్లడించారు. రూ.70 కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఆ నష్టాలకు కారణమైన గత ఛైర్మన్ అడ్డుకుని జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్డీబీ) అధికారులు రాకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్లోని డెయిరీ కార్యాలయంలో ఐదుగురు పాలకవర్గం సభ్యులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ డెయిరీతో ఒప్పందానికి ప్రయత్నిస్తున్నామని, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నామని చెప్పారు.
Read Also: Telangana Municipal Elections: 14వార్డుల్లో ఏకగ్రీవం

ఉద్యోగుల వేతనాల కోసం కృషి
ప్రభుత్వం గ్రాంటు ఇస్తుందా లేక ఎన్డీడీబీకి అప్పగిస్తుందా అనేది 15వ తేదీకల్లా (Madhusudhan Reddy) తేలుతుందన్నారు. ఉద్యోగుల వేతనాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మదర్ డెయిరీకి 13 ఏళ్లు పని చేసిన గత చైర్మన్ సంస్థను భ్రష్టు పట్టించారన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో ఉన్నట్లు చూపించి, దానికి దొంగ ఆడిట్ చేయించి ఆదాయ పన్ను కట్టించారని ఆరోపించారు. పాలకవర్గంపై చేసిన ఆరోపణలను ఖండించారు.
ప్రభుత్వంతో మాట్లాడి రూ.35కోట్లు ఇప్పిస్తానంటూ గత ఛైర్మన్ రైతులకు అబద్ధంచెప్పి సంతకాల సేకరణ చేశారన్నారు. రూ.35 కోట్లు రైతులు, ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తే తామే రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. చిట్యాలలో ఎకరా భూమి రూ.5 లక్షల చొప్పున కొని రూ.16 లక్షలకు కొన్నట్లు లెక్కలు చూపించారన్నారు. ఆ సొమ్ముతో 150 ఎకరాల భూమి వచ్చేదని తెలిపారు. 2023లో తాను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మదర్ డెయిరీ రూ.35 కోట్లు నష్టాల్లో ఉండ గా రూ.కోటీ 85 లక్షల లాభాల్లో ఉన్నట్లు చూపించి రూ.43 లక్షలు ఐటీ కట్టించడంతో సంస్థ మరింత నష్టాల్లోకి వెళ్లిందని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: