LB Nagar Cybercrime: ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఒక కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్సైలు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.
Read Also: Heat wave Exgratia: తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

పోలీస్ స్టేషన్‌లో ముమ్మర సోదాలు
ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబునాయక్, ఎస్ఐ ప్రమోద్ ఒక కేసు విషయంలో నిందితుడిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు, నోటీసులు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేసేందుకు లక్ష రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్లాన్ వేశారు.
ఫిర్యాదుదారు నుంచి ఆ లక్ష రూపాయల నగదును ఎస్ఐలు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లతో పాటు, ఇతర అక్రమాలు ఏమైనా జరిగాయా అనే కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. అరెస్టయిన ఎస్సైలు బాబునాయక్, ప్రమోద్‌లను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: