సిఎం రేవంత్రెడ్డికి ఎంపి ఆర్. కృష్ణయ్య లేఖ
హైదరాబాద్ : రాష్ట్రంలో 100 బీసీ కాలేజీ హాస్టల్ను మంజూరు చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుత కొనసాగుతున్న హాస్టల్లో 20 శాతం అదనపు సీట్లు కేటాయించాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, నిజాంబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లలో సీట్లు లభించక వేలాది మంది విద్యార్థులు సీట్ల కోసం ఇబ్బం దులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లేఖను మీడియాకు విడుదల చేశారు
కావున వెంటనే ప్రభుత్వం స్పందించి డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలలో బిసి కాలేజీ హాస్టళ్లను
మంజూరు చేయాలని ఆయన సీఎం (CM Revanth Reddy) కు విజప్తి చేశారు. హైదరాబాద్ జిల్లాలో 10 బాలికల, 10 బాలుర హాస్టల్స్ చొప్పున మంజూరు చేయాలని, అలాగే మహబూబ్నగర్ జిల్లాలో ఐదు బాలికల, ఐదు బాలుర హాస్టల్స్, సంగారెడ్డి జిల్లాలో ఐదు బాలికల, ఐదు బాలుర హాస్టల్స్, వికారాబాద్ జిల్లాలో ఐదుబాలుర, ఐదు బాలికల హాస్టల్స్, వరంగల్ జిల్లాలో ఐదు బాలికల, ఐదు బాలుర హాస్టల్స్, నల్లగొండ జిల్లాలో ఐదు బాలికల, ఐదు బాలుర హాస్టల్స్, వరంగల్ జిల్లాలో ఐదు బాలికల, ఐదు బాలుర హాస్టల్స్, మేడ్చల్ జిల్లాలో ఐదు బాలికల, ఐదు బాలురు హాస్టల్స్, రంగారెడ్డి జిల్లాలో ఐదు బాలికల, ఐదు బాలుర హాస్టల్స్ ల ను మంజూరు చేయాలని ఆర్.కృష్ణయ్య సిఎంకు విజప్తి చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :