हिन्दी | Epaper

Kummera Jathara incident: కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

Tejaswini Y
Kummera Jathara incident: కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

Kummera Jathara incident: కుమ్మెర జాతరలో మరణించిన చిన్నారి తండ్రికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నారు, అలాగే రెండు పడకల ఇల్లును మంజూరు చేయనున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ తెలిపారని తెలంగాణ బీసీ కమిషన్ ప్రకటించింది. తెలంగాణ బీసీ కమిషన్ ఫిబ్రవరి 23న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కుమ్మెర జాతర సంఘటనపై నివేదిక కోరడం జరిగింది. కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్మి ఫిబ్రవరి 24న కుమ్మెర గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకోవడం జరిగింది.

Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

Kummera Jathara incident: Government job and house for Kummera victims!
Kummera Jathara incident: Government job and house for Kummera victims!

జిల్లా కలెక్టర్ బధ్వావత్ సంతోష్ తమ నివేదిక

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బధ్వావత్ సంతోష్ తమ నివేదికను ఎల్సి/256/2026ను ఫిబ్రవరి 28న బీసీ కమిషను పంపగా కమిషను సోమవారం చేరినట్టు కమిషన్ తెలిపింది. జిల్లా యంత్రాంగం ద్వారా ఫిబ్రవరి 25,2026న పాప తండ్రి గణేష్ కు డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ నుండి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందని, పాప తండ్రి గణేష్ కు నాగర్కర్నూల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజిలో అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తన లేఖలో తెలిపారని కమిషన్ ప్రకటించింది. పాప తండ్రి గణేష్ కు 2 పడకల ఇంటిని ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పాప కుటుంబంతో మాట్లాడి, అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ రిపోర్టులో 18వ తారిఖునాడు కుమ్మెర మల్లన్న జాతర నుండి 21వ తారీఖు వరకు జరిగిన అన్ని సంఘటనలను కూలంకుషంగా వివరించడం జరిగిందని కమిషన్ సోమవారం జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. 17 ఫిబ్రవరి 2026 నుండి 20 ఫిబ్రవరి 2026 వరకు ఆ జాతరలో సుమారు 20 వేల భక్తులు పాల్గొన్నారని తెలపడం జరిగింది. 18వ తారీఖు సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో యు. శ్రీనివాస్ రెడ్డి ద్వారా నాగర్కర్నూల్ పోలీసే స్టేషన్లో చంద్రకళ, బౌరమ్మ, గణేష్లపై ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అదేరోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గణేష్ ద్వారా శ్రీనివాస్ రెడ్డితోపాటు మరో ఆరుగురిపై ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడినది.

ఫిబ్రవరి 21 నాడు మౌనిక తన 2 నెలల పాప ఉదయం 6 గంటల నుండి స్పందించడం లేదని నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తీసుకురాగా ఉదయం 7:00 గంటల ప్రాంతంలో డ్యూటి డాక్టర్ ఆ పాప చనిపోయిందని డిక్లేర్ చేయడం జరిగింది. తల్లి అయిన మౌనిక అనుమానం మేరకు ఈ కేసును అనుమానస్పద కేసుగా నాగర్కర్నూల్ పీఎస్లో రిజిస్టర్ చేయడం జరిగిందని కలెక్టర్ రిపోర్టులో పేర్కొన్నారు. 23వ తేది నాడు ఏ1 శ్రీనివాస్ రెడ్డి, ఏ2 మధుసూదన్ రెడ్డి, ఏ3 శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడికి పంపారు. మరో 6 గురు నిందితులు పరారిలో ఉన్నారని కలెక్టర్ రిపోర్టులో చెప్పడం జరిగింది. పాప తల్లి మౌనిక కులాన్ని నిర్ధారించడానికి ఆధారంగా ఆమె ఎటువంటి సర్టిఫికేట్లు ఇప్పటివరకు అందజేయలేదని కల్టెర్ తెలిపారు. మౌనిక కులాన్ని నిర్ధారించడానికి మహమ్మదాబాద్ తహశీల్దార్కు ఆదేశించగా మౌనిక తల్లి బాలక్రిష్ణమ్మ పిచ్చగుంట్ల (వంశరాజ్) కులానికి చెందినదని ఆ కులం బీసీ-ఏ సీరియల్ నెం. 18గా తెలుపుతూ లెటర్ నెం. బి/306/2026, ద్వారా తెలపడం జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

లైవ్‌ అప్‌డేట్స్ : గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు
0:30

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా?

మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా?

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

హార్ముజ్‌లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం!

హార్ముజ్‌లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం!

కల్తీ నెయ్యి విచారణపై దినేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

కల్తీ నెయ్యి విచారణపై దినేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

📢 For Advertisement Booking: 98481 12870