हिन्दी | Epaper

Phone Tapping : సిట్ నోటీసు పై కేటీఆర్ రియాక్షన్

Sudheer
Phone Tapping : సిట్ నోటీసు పై కేటీఆర్ రియాక్షన్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది. సిట్ నోటీసులపై ఆయన అత్యంత ఘాటుగా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కేటీఆర్ ఒక “లొట్టపీసు కేసు”గా అభివర్ణించారు. ప్రభుత్వం కేవలం లీకులతోనే కాలం గడుపుతోందని, వాస్తవానికి ఈ కేసులో పస లేదని ఆయన కొట్టిపారేశారు. తనకు అందజేసినట్లు చెబుతున్న నోటీసులను తాను ఇప్పటివరకు చూడలేదని, కేవలం మీడియా ద్వారానే ఆ విషయం తెలిసిందని పేర్కొన్నారు. అయితే, నోటీసులు అందినా, అందకపోయినా తాను “బరాబర్” (ఖచ్చితంగా) విచారణకు వెళ్తానని, తనకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలే భయపడనని చెబుతూ, అధికారుల కంటే ముఖ్యమంత్రి రాజకీయ కక్షతోనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.

Davos: సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే తన పని అని, అందుకే ఈ నోటీసుల నాటకం ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, 420 హామీలను అమలు చేసే వరకు రేవంత్ రెడ్డి సర్కార్‌ను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా ప్రజల దృష్టిని హామీల అమలు నుండి మళ్లించడమే ప్రభుత్వ ఎజెండా అని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రతిపక్షంగా తమ పోరాటం ఆగదని, ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

When KCR speaks, some people get worried

కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక రకంగా సిట్ విచారణకు సిద్ధమనే సంకేతాలు ఇవ్వడమే కాకుండా, విచారణాధికారులపై కూడా ఒత్తిడి పెంచేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ పనితీరుపై రొటీన్ ప్రక్రియగా జరుగుతున్న అంశాలనే భూతద్దంలో చూపిస్తున్నారని ఆయన వాదించారు. సాయంత్రం 6 గంటలకు సిరిసిల్లలో ఆయన చేసిన ఈ ప్రసంగం, రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరగబోయే విచారణకు ముందే ఒక రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. కేటీఆర్ మాటలను బట్టి చూస్తే, ఆయన విచారణాధికారులకు సహకరిస్తూనే, బయటకు వచ్చి మరింత దూకుడుగా రాజకీయ పోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

పతనం అంచున ప్రజారోగ్యం

పతనం అంచున ప్రజారోగ్యం

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

📢 For Advertisement Booking: 98481 12870