KTR SIT inquiry : ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.
మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి వారు తన ఎదురుగా ఉన్నారని వార్తలు రావడం పూర్తిగా అసత్యమని కేటీఆర్ అన్నారు. “అక్కడ నేను, పోలీసులు తప్ప ఇంకెవ్వరూ లేరు. లేనిపోని విషయాలను (KTR SIT inquiry) బయటకు ఎలా లీక్ చేస్తారు?” అంటూ సిట్ అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. హీరోయిన్ల పేర్లతో తనపై దుష్ప్రచారం జరుగుతోందని, ఆ సమాచారం సిట్ నుంచే వచ్చిందా అని అడిగితే, తాము అలాంటి వివరాలు మీడియాకు ఇవ్వలేదని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు.
Read Also: SONY- TCL: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక పరిణామం
ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయా అని సిట్‌ను ప్రశ్నించగా, “మాకు సంబంధం లేదు” అని మాత్రమే చెప్పారని, కానీ “ట్యాపింగ్ జరగడం లేదు” అని స్పష్టంగా చెప్పలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోసారి విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సుమారు 7 గంటల పాటు కేటీఆర్‌ను సిట్ అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించారా అనే కోణంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశముందని అధికారులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: