हिन्दी | Epaper

KTR letter : హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

Sai Kiran
KTR letter : హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

KTR letter : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తికావస్తున్న నేపథ్యంలో, ఎన్నికల హామీల అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాబోయే 2026–27 బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీల అమలులో చిత్తశుద్ధి చూపకపోతే ప్రజల పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటి అమలును విస్మరించిందని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. గత రెండు బడ్జెట్లలోనూ అవసరమైన నిధులు కేటాయించలేదని పేర్కొంటూ, ఈసారి మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమానికి భారీ కేటాయింపులు చేయాలని కోరారు. ప్రజల ఓపిక నశిస్తోందని, ఇక ఆలస్యం చేయకూడదని సూచించారు.

Read Also: T20WC 2026: ఆసీస్ ఎలిమినేషన్‌పై రికీ పాంటింగ్ ఏమన్నారంటే?

KTR letter
KTR letter

అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు డిక్లరేషన్ల రూపంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. ఈ బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి నిలదీస్తామని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

📢 For Advertisement Booking: 98481 12870