KTR: తెలంగాణ (Telangana) రాష్ట్రానికి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (KTR) విశేష ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 19, 2025 ఉదయం ఆయన బ్రిటన్ (Britain) పర్యటనకు బయలుదేరారు.

ఆక్స్‌ఫర్డ్ వేదికపై ముఖ్య అతిథిగా కేటీఆర్
కేటీఆర్ తన యూకే పర్యటనలో ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford University) లో రేపు, ఎల్లుండి జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు.
తెలంగాణ అభివృద్ధి కథనాన్ని ప్రపంచానికి వివరించనున్న కేటీఆర్
ఆక్స్‌ఫర్డ్ వేదికపై ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు‘ అనే ప్రధాన ఇతివృత్తంతో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్, గతంలో తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారనే అంశాలపై మాట్లాడతారు.
సదస్సు ప్రత్యేకత – గ్లోబల్ దృష్టికోణం
ఈ ఫోరమ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొనే ఈ సదస్సులో, సాంకేతికత ద్వారా భారతదేశం సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించగలదనే విషయంపై విస్తృతంగా చర్చించనున్నారు.
తిరిగి హైదరాబాదుకు రాక
ఈ పర్యటన ముగిసిన అనంతరం కేటీఆర్ జూన్ 24న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఆయన పర్యటన తర్వాత కొన్ని కీలక పెట్టుబడుల ఒప్పందాలు, భాగస్వామ్యాల ప్రకటనలు జరిగే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read also: Hyderabad: ఈ నెల 28 న కొండాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభం