हिन्दी | Epaper

KTR: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

Sharanya
KTR: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఆయన అరెస్టును తెరాస (బీఆర్‌ఎస్‌) నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావులు (Harish Rao) తీవ్ర స్థాయిలో స్పందించారు.

కేటీఆర్ ఆగ్రహం:

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన కేటీఆర్, ఈ చర్య పూర్తిగా అప్రజాస్వామికం అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలు, మంత్రుల అవినీతిని నిలదీస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. “పనికిరాని కేసులతో బీఆర్ఎస్ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై, ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు” అని కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న నేతలను అణచివేయాలనే కుట్రల భాగమే అని వ్యాఖ్యానించారు.

తమ నేతలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, అవి న్యాయస్థానాల్లో నిలబడే అవకాశం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు:

మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ‌ తీరు ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని హరీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Read also: Phone tapping: డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌ చేశాను :ప్రభాకర్‌రావు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

📢 For Advertisement Booking: 98481 12870