Kothagudem mayor election : తెలంగాణ రాజకీయాల్లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర నాయకుడు పల్లా వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా కొత్తగూడెంలోని శక్తి సమీకరణాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం.
కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ కూటమి (కాంగ్రెస్ 22, సీపీఎం 1) కలిపి 23 డివిజన్లలో విజయం సాధించింది. మరోవైపు సీపీఐ 22 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, స్వతంత్రులు 6 స్థానాల్లో విజయం సాధించారు. స్వతంత్రుల్లో ఒకరు సీపీఐకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 23కు చేరింది. మిగిలిన స్వతంత్రుల్లో ముగ్గురు, అలాగే బీఆర్ఎస్ నుంచి ముగ్గురు సభ్యులు కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలపడంతో కూటమి బలం 29కు పెరిగింది.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత

మేయర్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్-సీపీఐలు కలిసి ముందుకు సాగుతాయా? లేక విడిగా వ్యూహం రచిస్తాయా? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెం మేయర్ పీఠం కోసం జరుగుతున్న రాజకీయ సమీకరణాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: