సుప్రీంకోర్టు కమిటీ పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభం
కొల్లేరు(Kolleru)లో వాస్తవ పరిస్థితులు పరిశీలించేందు ఈనెల 17,18 తేదీల్లో జిల్లాలో సుప్రీంకోర్ట్ (Supreme Court) నియమించిన సాధికారిత కమిటీ పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి (K. Vetriselvi) తెలిపారు. సోమవారం సాధికారిత కమిటీ పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మండవల్లి మండలం మణుగునూరు, పులపర్రు, కైకలూరు (Kaikaluru) మండలం ఆటపాక, ఆలపాడు, కొల్లేటికోట ప్రాంతాలలో కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. వీరితో పాటు కైకలూరు శాసన సభ్యులు డా. కామినేని శ్రీనివాసరావు, ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కొల్లేరుకు సంబంధించి సుప్రీం సాధికారిత కమిటీ ఈనెల 17,18 తేదీల్లో కొల్లేరులోని కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నట్లు తెలిపారు.
మానవీయత కోణంలో కొల్లేరు(Kolleru)లో ఎన్ని నివాసిత ప్రాంతాలు ఉన్నాయి, జిరాయితీ భూములు, డి.ఫారం పట్టా భూములు ఏమున్నాయి, 2006 సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఎలా అమలు చేశారనే సంబంధిత 4 అంశాలను కమిటీ పరిశీలించనున్నదన్నారు. దీనికి సంబంధించి మంగళ, బుధ వారాల్లో సాధికారిత కమిటీ పర్యటించే ప్రాంతాల ప్లాన్ను తయారు చేసేందుకు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందన్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం బుధవారం ఏలూరు కలెక్టరేట్ లో కొల్లేరుకు సంబంధించిన వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిటీ పర్యటన
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలోని కొల్లేరు వాసులు కూడా తమ సమస్యలను అందజేయవచ్చన్నారు. కైకలూరు శాసన సభ్యులు డా. కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ వేత్తలు, కొల్లేరులో కొన్ని వందల సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ప్రజలు వారి అవసరాలు, వారి సమస్యలు, జీరాయితీ భూములకు సంబంధించి పరిశీలనకోసం సుప్రీం సాధికారిత కమిటీ జిల్లాలో పర్యటించనున్నదన్నారు. కొల్లేరులో వాస్తవ పరిస్థితులు పరిశీలించి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున, కొంతమంది ప్రైవేట్ రైతులు కూడా అర్జీని పెట్టుకోవడం జరిగిందన్నారు. 2006 కొల్లేరులో చేపల చెరువులు కొట్టిన పరిస్థితి, ప్రజల జీవనవిధానం వారి ఇబ్బందులను జీరాయితీ భూముల వివరాలను కమిటీ మంగళవారం నిడమర్రు ప్రాంతంలో జిరాయితీ భూములను, బుధవారం కైకలూరు ప్రాంతం లోని ఆటపాక, కొల్లేటికోటలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తర తరాల నుంచి జీవిస్తున్న కొల్లేరు ప్రజలు తమ వినతులను కమిటీకి సమర్పిస్తారన్నారు.
Read also: Medical Colleges : మూడేళ్లలో మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు – సీఎం రేవంత్