హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన రైతుల (tribal farmers) సమస్యలు పరిష్కరిం చడానికి కృషి చేస్తానని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు గాను గిరిజన రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. హైదరా బాద్లోని తమ కార్యాలయంలో గిరిజన రైతులు సాగు సమస్యలపై సమావేశం జరిగింది.

ఆర్డీఎస్ఆర్ రికా ర్డును రెవెన్యూ రికార్డును అనుసంధానం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ గెట్టు సమస్యలు ఉన్నచోట రీసర్వే వెంటనే జరగాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ హక్కుల చట్టంలో పేర్కొన్న విధంగా ఆర్డీఎస్ఆర్ రికా ర్డును రెవెన్యూ రికార్డును అనుసంధానం చేయడం ద్వారా చాలా వరకు గిరిజన రైతులా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భూ భారతి చట్టాన్ని (Bhu Bharati Act) గిరిజన ప్రాంతంలో అమలు చేయడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని చెప్పారు. బ్యాంకర్లు కూడా అటవీహక్కుల రికార్డు ఆధా రంగా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫారెస్టు సెటిల్మెంట్ ప్రక్రియ త్వరతిగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులతో పాటు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఫారెస్ట్ డీసీఎఫ్ రాజారమణ రెడ్డి, సీసీఎస్ఏ, ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖ తదితర అధికారులు హాజరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: