हिन्दी | Epaper
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

Khammam: 28 నుంచి మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Saritha
Khammam: 28 నుంచి మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

(Khammam) గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. ఈ పాఠశాలల్లో(School) ఆరో తరగతి నుంచి ప్రవేశాలు ఉంటాయి. సీటు వచ్చాక ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకోవచ్చు, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో. ఈ స్కూళ్లలో బాలికలకు వసతి సదుపాయంతో పాటు చదువు, 26 రకాల వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్, యోగా, కరాటే శిక్షణ కూడా అందించనున్నారు. తాజాగా ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల విడుదలైంది.

Read Also: Medaram 2026: జాతరకు తరలి వస్తున్న లక్షలాది ప్రజలు

Khammam: 28 నుంచి మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఖమ్మం జిల్లాలో (Khammam) రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. కారేపల్లి, టేకులపల్లి మండలాల్లో కొనసాగుతున్న ఈ స్కూళ్లలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుండటంతో.. ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతోంది. ఆరో తరగతిలో 100 సీట్లు ఉండగా, ఏడు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు జరుగుతాయి. టేకులపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, టేకులపల్లి, కారేపల్లి స్కూళ్లకు ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు., విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. 

ఈ స్కూళ్లలో అడ్మిషన్ కోసం దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు

  • ఏదైన ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
  • జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఓసీ అభ్యర్థులు రూ. 200,
  • బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ విద్యార్థులు రూ. 125 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ప్రవేశ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో 100 మార్కులకు ఉంటుంది.
  • ఆరో తరగతిలో చేరే విద్యార్థులకు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్ల సబ్జెక్టుల నుంచి ఒక్కో దానిలో 25 ప్రశ్నలు వస్తాయి.
  • ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆంగ్లం నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  • ఏప్రిల్ 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870