हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Telugu News: Khammam: ఫలితాల తారుమారుతో పరేషాన్

Sushmitha
Telugu News: Khammam: ఫలితాల తారుమారుతో పరేషాన్

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, (Khammam) నల్లగొండ (Nalgonda) జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలు వెలువడిన తర్వాత ఓటమి పాలైన అభ్యర్థులు అనేక వింత నిరసనలు, చిత్ర విచిత్రాలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నిక కావాలని కలలు కన్న వీరు, ఎన్నికల్లో (election) భారీగా ఖర్చు చేసినప్పటికీ ఓటర్ల చేతిలో భంగపడటంతో ఈ రకమైన చర్యలకు దిగారు. గత పది పర్యాయాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి నిరసనలు జరగలేదు. ప్రస్తుతం ఈ సంఘటనలు వివిధ పార్టీల శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also: SP Balu Statue : బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

Khammam
Khammam Confusion over results manipulation

డబ్బులు ఇవ్వాలంటూ వింత డిమాండ్‌లు

ఓటమి పాలైన పరాజిత అభ్యర్థులు ఓటు వేయని వారిని గుర్తించి, ఎన్నికల ముందు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం కొన్ని గ్రామాల్లో కనిపించింది.

  • నార్కెట్‌పల్లి, ఔరవాణి (నల్లగొండ జిల్లా): కాంగ్రెస్ అభ్యర్థిపై ఓటమిపాలైన టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి కాలూరి బాలరాజు మరియు ఆయన భార్య వింత నిరసన చేశారు. తమకు ఓటు వేయకుండా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ, దేవుడి ఫోటో, పురుగుల మందు డబ్బా పట్టుకుని ఇంటింటికి తిరిగారు. ఓటు వేశామని చెబుతున్నప్పటికీ, దేవుడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
  • సోమ్లా తండా, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ వదిన, కాంగ్రెస్ అభ్యర్థి భూక్య కౌసల్య ఓటమిపాలయ్యారు. ఆమె భర్త దల్ సింగ్ మరియు కుమారుడు సందీప్, సేవాలాల్ జెండాతో తండాలో ఇంటింటికి తిరుగుతూ, ఎన్నికల ముందు తాము ఓటర్లకు ఇచ్చిన పైకము, కోడిని తిరిగి ఇవ్వాలని కోరారు. ఓటు వేసినట్లు కులదైవమైన సేవాలాల్ జెండా పట్టుకుని ప్రమాణం చేయాలని కూడా డిమాండ్ చేశారు.

సెల్ టవర్ నిరసన మరియు భార్యల విజయం

  • హరియా తండా, ఖమ్మం జిల్లా: సర్పంచ్ ఎన్నికల్లో తన భార్య (స్వతంత్ర అభ్యర్థి) ఓటమిపాలైనందుకు మాలోతు రంగా సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. ప్రజలకు ఎంత సేవ చేసినా, డబ్బులు పంచినా ఓడించారని ఆవేదన వ్యక్తం చేస్తూ, 6 గంటల పాటు సెల్ టవర్ పైనే ఉన్నాడు. ఎన్నికపై విచారణ జరిపిస్తామని ఎమ్మార్వో నచ్చజెప్పడంతో రంగా కిందకు దిగాడు.
  • చింతకాని మండలం (ఖమ్మం జిల్లా): ఇక్కడ మరో విచిత్రమైన సంఘటనలో, 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన భర్తల భార్యలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మత్కేపల్లి నామవరం గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు కంచం కోటేశ్వరరావు భార్య ద్రౌపది గెలుపొందగా, వందిళ్ళపల్లి గ్రామంలో సీపీఎం నేత ఉత్సవాయి జానకి రాముడు భార్య పద్మ కూడా సర్పంచ్‌గా గెలిచారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

నేను పార్టీ మారేందుకు హరీశ్ కారణం కాదు – జగ్గారెడ్డి క్లారిటీ

నేను పార్టీ మారేందుకు హరీశ్ కారణం కాదు – జగ్గారెడ్డి క్లారిటీ

రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!…

రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!…

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

📢 For Advertisement Booking: 98481 12870