ఆర్టీసీ బస్సు – టిప్పర్ ఢీకొని 21 మంది మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(KCR) మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు.
Read also: బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా..మోదీ దిగ్బ్రాంతి

కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం
ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కేసీఆర్ మాట్లాడుతూ, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు(KCR) తీసుకోవాలి. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలి,” అని అన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన సూచించారు.
కేటీఆర్ సంతాపం, ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “చేవెళ్ల మండలం ఖానాపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదం మనసును కలచివేసింది. 21 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రానికి పెద్ద నష్టం,” అని పేర్కొన్నారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలనీ, మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలనీ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయన మరింతగా మాట్లాడుతూ, రహదారులపై ఉన్న గుంతలు, తగిన రహదారి భద్రతా చర్యల లోపం వంటి అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సూచించారు.
బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతి
కేసీఆర్ మరియు కేటీఆర్ ఇద్దరూ తమ సంతాప సందేశాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితుల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని, ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.
సంఘటన స్థలంలో విషాద వాతావరణం
ఘటన జరిగిన తర్వాత చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి వద్ద ప్రయాణికుల కుటుంబ సభ్యులు, స్థానికులు తాకిడి చేశారు. అక్కడ హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేస్తూ గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: