हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

KCR: సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ

Pooja
KCR: సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ

సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల తీరుపై మాజీ సీఎం కేసీఆర్(KCR) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఆరు పేజీల లేఖ రాసి, నోటీసుల జారీ విధానం చట్టబద్ధంగా లేదని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చే సమయంలో అఫిడవిట్‌లో పేర్కొన్న చిరునామా కాకుండా, ప్రస్తుతం వ్యక్తి నివసిస్తున్న వాస్తవ చిరునామానే ప్రాముఖ్యం అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తన నివాసం ఎర్రవల్లి అని స్పష్టం చేశారు.

Read Also:Phone Tapping Case : నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్

KCR

ఇంటి గోడలకు నోటీసులు అంటించడం గౌరవానికి భంగం

తన నివాసం కాదని చెప్పినా, ఇంటి గోడలపై నోటీసులు అంటించడం సరైన విధానం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై గతంలో కోర్టులు ఇచ్చిన పలు తీర్పులు, ఉత్తర్వులను కూడా లేఖలో ప్రస్తావించారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాడని, అలాంటి పరిస్థితిలో అక్కడి పోలీసులు తనకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని కేసీఆర్ లేఖలో తెలిపారు.

ద్వంద్వ వైఖరిపై ప్రశ్నలు

హరీష్ రావు అఫిడవిట్‌లో సిద్దిపేట చిరునామా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లోనే నోటీసులు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్(KCR) గుర్తుచేశారు. ఇది పోలీసుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. సిట్ తీరుపై చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. సిట్ కోరినట్టే హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు.

గత నెల జనవరి 29న మొదటిసారి నోటీసులు ఇచ్చిన సిట్, మరుసటి రోజే అంటే జనవరి 30న విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే ఆ రోజు వీలుకాదని, మరో తేదీ నిర్ణయించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ జరపాలని కోరారు.

65 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక నిబంధన

65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు కోరిన ప్రదేశంలోనే విచారించాలన్న నిబంధనను కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు. అయినప్పటికీ, ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణకు సాంకేతిక ఇబ్బందులున్నాయని, రికార్డుల్లో ఆ చిరునామా లేకపోవడంతో అక్కడ విచారణ సాధ్యం కాదని సిట్ స్పష్టం చేసినట్లు తెలిపారు. జనవరి 30న రెండోసారి నోటీసులు ఇచ్చిన సిట్, హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని సూచించింది. అయితే రెండు సందర్భాల్లోనూ ఇంటి గోడలకు నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870