సొంత రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కవిత, ఆ దిశగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ నిర్మాణం, విధివిధానాలు, గుర్తు వంటి అంశాలపై ఆమె సమగ్రంగా చర్చలు జరిపి స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also:Ministers Meeting : మంత్రులు భేటీ అయితే తప్పేముంది – మహేష్ కుమార్ గౌడ్

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరు ఖరారు?
పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరును ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె(Kavitha) స్థాపించిన జాగృతి సంస్థతో ఉన్న భావోద్వేగ అనుబంధం కారణంగా, అదే పేరును రాజకీయ పార్టీలోనూ కొనసాగించాలని కవిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ పేరు ప్రజల్లో త్వరగా గుర్తింపు పొందుతుందనే అభిప్రాయం ఆమెకు ఉన్నట్లు తెలిసింది.
పార్టీ విధివిధానాలపై కసరత్తు
పార్టీ సిద్ధాంతం, కార్యాచరణ, నాయకత్వ నిర్మాణం, సభ్యత్వ విధానం వంటి అంశాలపై ఇప్పటికే ప్రాథమిక స్థాయి కసరత్తు పూర్తైనట్లు సమాచారం. తెలంగాణ(Kavitha) ప్రజల సమస్యలను కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ దిశను చూపించాలనే లక్ష్యంతో కవిత ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
శుభారంభానికి ఉగాది పండుగను ఎంపిక చేసుకుని, అదే రోజు పార్టీ పేరు, కార్యాచరణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బీజం పడే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: