हिन्दी | Epaper

KCR: ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించిన  కవిత

Sharanya
KCR: ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించిన  కవిత

బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇటీవల ఆరోగ్య సమస్యలతో (health problems) బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజులుగా జ్వరం, నీరసం వంటి లక్షణాలతో బాధపడుతున్న కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు జూలై 3వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ప్రాథమికంగా కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారని తెలిపారు.

KCR: తండ్రిని పరామర్శించిన  కవిత
KCR: తండ్రిని పరామర్శించిన  కవిత

ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన

గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో, ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచన మేరకు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు కేసీఆర్‌ (KCR) కు పలు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యంపై నిన్న రాత్రి యశోద ఆసుపత్రి (Yashoda Hospital) వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్ స్థాయులు అధికంగా, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు తేలిందని బులెటిన్‌లో పేర్కొన్నారు. షుగర్, సోడియం సాధారణ స్థితికి వచ్చే వరకు కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.

కుటుంబ సభ్యుల పరామర్శ

కేసీఆర్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

Read also: HAM Roads: హ్యామ్ రోడ్లపై అపోహలు వద్దు.. టోల్ వసూల్ ఉండదు- మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

Read hindi news: hindi.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870