हिन्दी | Epaper

KCR: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ తో సహా బడానాయకులకు నోటీసులు!

Vanipushpa
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ తో సహా బడానాయకులకు నోటీసులు!

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌( KCR)కు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghose) నేతృత్వంలోని కమిషన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌తో పాటు, ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్ రావు(Harishrao), బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్‌(Etala Rajendar) కు కూడా కమిషన్ నోటీసులు పంపింది.
15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరు
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఈ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించింది. ఇందుకోసం నిర్దిష్ట తేదీలను కూడా కమిషన్ ఖరారు చేసింది. కేసీఆర్ జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కమిషన్ తన నోటీసులో స్పష్టం చేసింది. అలాగే, కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీశ్ రావు జూన్ 6వ తేదీన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ జూన్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కమిషన్ పేర్కొంది.

KCR: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ తో సహా బడానాయకులకు నోటీసులు!
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ తో సహా బడానాయకులకు నోటీసులు!

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో..
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కూడా విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటి పారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరానికి తగిన విధంగా కమిషన్ గడువును ఏడుమార్లు పొడిగించింది.

Read Also: Jyothirmayi: ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్జి ప్రసవం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు

ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

ఆ కేసులో జక్కుల లక్ష్మణ్ ఏమన్నారంటే?

ఆ కేసులో జక్కుల లక్ష్మణ్ ఏమన్నారంటే?

ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది

ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది

📢 For Advertisement Booking: 98481 12870