
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంగళవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే(Jubilee Hills) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ, ప్రజలకు డబ్బులు పంచుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బీఆర్ఎస్(BRS) నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతుంటే ఊరుకుంటున్నారని ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బూత్-121లో ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ హల్చల్ జూబ్లీహిల్స్ సిద్ధార్థ్ బూత్-121లో వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ హల్చల్ చేశారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులతో గొడవకు దిగారు. కాసేపటి తర్వాత కారులో అక్కడ నుంచి రామ్ దాస్ నాయక్ జారుకున్నారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ ఎంఐఎం నాయకులు తిరిగారు. తన అనుచరులతో కలిసి కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ హల్చల్ చేశారు.
Read also: రామ్ చరణ్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్!

పోలీసులపై మాగంటి సునీత ఆగ్రహం
కాగా పోలీసులు(Jubilee Hills) కాంగ్రెస్ నాయకులకు సహకరిస్తున్నారంటూ మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేసేందుకు వస్తుంటే, పోలీసులు వాళ్లకి సహకరిస్తున్నారని మండిపడ్డారు సునీత.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: