हिन्दी | Epaper

News Telugu: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూలీలకు,విద్యార్థులకు కాసుల వర్షం!

Rajitha
News Telugu: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూలీలకు,విద్యార్థులకు కాసుల వర్షం!

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి కూలీలకు కాసుల జల్లు కురిపిస్తోంది. సాధారణంగా పని కోసం అడ్డాల్లో ఎదురుచూసే దినసరి కూలీలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రచార బృందాల్లో బిజీగా ఉన్నారు. ఉదయం ఎనిమిదింటికే కృష్ణానగర్‌, బోరబండ, (Borabanda) రహ్మత్‌నగర్‌, శ్రీనగర్‌ కాలనీల్లో ఖాళీగా కనిపించే కూలీ అడ్డాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఎందుకంటే, ఉపఎన్నికల హడావిడిలో పార్టీలు వీరిని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు తీసుకెళ్తున్నాయి. ప్రతి డివిజన్‌లో అభ్యర్థులు, కీలక నేతల వెంట కనీసం వందమంది ఉండేలా పార్టీలు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

Read also: TG: నా చివరి కోరిక ఇదే: ఆర్. కృష్ణయ్య భావోద్వేగ వ్యాఖ్యలు

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూలీలకు,విద్యార్థులకు కాసుల వర్షం!

Jubilee Hills: ప్రచార పనుల్లో పాల్గొనే కూలీలకు రోజుకు రూ.400 నుంచి రూ.600 వరకు చెల్లిస్తున్నారు. అదనంగా మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. కొన్ని పార్టీలు మరింత ఆకర్షణీయంగా రూ.800 వరకు చెల్లిస్తున్నాయని సమాచారం. దీంతో స్థానిక కూలీలే కాకుండా జూనియర్ ఆర్టిస్టులు కూడా ప్రచారంలో భాగమవుతున్నారు. ఇదే సమయంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులను ఓటర్ల సర్వే పనిలో వినియోగిస్తున్నారు. బూత్‌ వారీగా ఓటర్ల జాబితాలను అందించి ఇంటింటికీ సర్వే చేయిస్తున్నారు. ఓటర్లు తమ చిరునామాలో ఉన్నారా లేదా తెలుసుకొని వారి ఫోన్‌ నంబర్లను సేకరించడం వీరి పని. ఈ పనికి విద్యార్థులకు రోజుకు రూ.1000 వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. సేకరించిన డేటా ఆధారంగా పార్టీలు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, వాట్సాప్‌ సందేశాలు, టెలీకాల్స్‌ ద్వారా ఓటర్లను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

పతనం అంచున ప్రజారోగ్యం

పతనం అంచున ప్రజారోగ్యం

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

📢 For Advertisement Booking: 98481 12870