Agriculture University Students Protest: యూనివర్సిటీలో విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా బంది చేస్తున్నారని పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని యూనివర్సిటీ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్కుమార్, కార్యదర్శి మనోజ్ కుమార్ గౌడ్, లోకేష్ ముదిరాజ్ మండిపడ్డారు. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న రెండురోజు నిరాహర అమరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల హక్కులను కాల రాస్తున్నారని విద్యార్థులకు పెంచిన స్టైపెండును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్కుమార్, కార్యదర్శి మనోజ్ కుమార్ గౌడ్, లోకేష్ ముదిరాజ్ లు కాలేజీ బిల్డింగ్ పైకి నిరసన చేపట్టారు. పోలీసులు, అధికారులు విద్యార్థులకు ఎంత నచ్చజెప్పిన భవనంపై నుండి కిందకు దిగిరాకపోవడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి హామీ ఇచ్చేంతవరకు మా ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
Read Also: Telangana Panchayats : పంచాయతీలకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి సీతక్క

వర్సిటీ భవనంపైకి ఎక్కి విద్యార్థుల నిరసన
ఈ సందర్భంగా భవనంపై నుండి ప్రెసిడెంట్ రాజ్కుమార్ మాట్లాడుతూ… యూనివర్సిటీలో విద్యార్థులకు స్వేచ్చ లేకుండా బంది చేస్తాన్నారని మా ముగ్గురి ఆత్మహత్యతోనైనా యూనివర్సిటీ రూపురేఖలు మరాలన్నారు. ప్రభుత్వం పెట్టిన సర్కార్ను వెంటనే అమోదం తెలిపి అమలు చేయాలని వ్యవసాయ మంత్రి ఎందుకు ఇన్ని రోజులు సరర్ ఆపివేశారో చెప్పాలని వెంటనే మంత్రులు, డిప్యూటీ సిఎం స్పందించి రావాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రెండు సార్లు వచ్చారని సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని రాష్ట్రనికి, వ్యవసాయానికి వెన్నముకగా యూనివర్సిటీ నిలుస్తుందని చాలా సమస్యలు ఉన్నాయని మా యొక్క చావుతోనైనా యూనివర్సిటీ రూపురేఖలు మారాలని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చి స్పష్టమైన ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
విద్యార్థులకు బీఆర్ఎస్ మద్దతు
ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యూనివర్సిటీకి చేరుకొని విద్యార్థుల నిరసనకు మద్దతు పలికారు. విద్యార్థుల సమ్యలను కెటిఆర్కు ఫోన్లో వివరించాడంతో కెటిఆర్ విద్యార్థులతో ఫోన్ ద్వారా మాట్లాడారు వ్యవసాయ వర్సిటీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈనెల 16వ తేది నుండి ప్రారంభయే అసెంబ్లీ సమావేశంలో వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై అసెంబ్లిలో ప్రభుత్వాన్ని నిలదిస్తామని ప్రభుత్వం యూనవర్సిటీ భూములను హైకోర్టు కోసం తీసుకున్నారని చాలా రకాలు రియల్ ఎస్టెట్ పనులకు కూడా యూనివర్సిటీ స్థలాలను వాడుకుంటున్నారని యూనవర్సిటీకి అన్యాయం చేయడం సరికాదని విద్యార్థుల పక్షాన పోరాటం చేసి వారికి అన్ని విధాలుగా న్యాయం
జరిగాలే చూస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వంపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శలు
విద్యార్థుల నిరసనలో బిఆర్ఎస్ నేత ఆర్ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాది రైతు ప్రభుత్వామని రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారని రైతాంగాన్ని ఆదుకునే పిజిలు, పిహెచ్ విద్యార్థులకు మాత్రం కనీస అవసరాలను పరిష్కరించడం లేదని విద్యార్థుల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తున్నా విద్యార్థులను పోలీసుతో అణివేయాలని చూస్తున్నారని పిజి, పిహెచ్ విద్యార్థులకు 15వేల చేస్తున్నట్లు సర్లర్ ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని మంత్రి వద్దు వద్దు అంటున్నారని విద్యార్థులు చెప్పుతున్నారని మంత్రి ఎందుకు వద్దు అంటున్నారని చెప్పాలని మంత్రులు కోట్ల రూపాయలను తమ అవసరాలకు వాడుకుంటునప్పుడు పేద విద్యార్థులకు ఇవ్వడానికి రాదని ప్రశ్నించారు.
45 లక్షల రూపాయలు ఇస్తే సమస్య తీరుతుందని కాని విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. విసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తుంటుంటే మంత్రి తుమ్మల అడ్డం పడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి రావాల్సిన స్టెపెండు వెంటనే అమలు చేయాలని అదేవిధంగా తుమ్మల నాగేశ్వర్ రావు వెంటనే రాజినామా చేయాలని డిమాండ్ చేశారు. చివరగా స్పందించిన యూనివర్సిటీ వీసి విద్యార్థులకు ఈనెల16లోపు అకౌంట్లో అమౌంట్ జామ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం దీక్ష విరమించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: