हिन्दी | Epaper

Jagityala Congress : జగిత్యాల కాంగ్రెస్ వివాదం, ముగిసిందా?

Sai Kiran
Jagityala Congress : జగిత్యాల కాంగ్రెస్ వివాదం, ముగిసిందా?

Jagityala Congress : జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ జోక్యం చేసుకోవడంతో వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ సవాంగ్ ప్రజాభవన్‌లో ఇరు వర్గాల నేతలతో చర్చలు జరిపి సయోధ్యకు దారి తీసినట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికల సమయంలో రెండు వర్గాలు విడివిడిగా పోటీ చేయడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఇరు వర్గాలు గణనీయ ఫలితాలు సాధించడంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఐక్యత అవసరమని అధిష్టానం భావించింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి కలిసి పనిచేయాలని సవాంగ్ సూచించగా ఇరువురు నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Read Also: TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

Jagityala Congress
Jagityala Congress

పదవుల కేటాయింపుపై జరిగిన చర్చలో పార్టీ కోసం దీర్ఘకాలంగా పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. చైర్మన్ పదవి ఒక వర్గానికి, వైస్ చైర్మన్ మరో వర్గానికి ఇవ్వడం లేదా రెండున్నరేళ్లు చొప్పున పదవి పంచుకునే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగిత్యాలలో కాంగ్రెస్ ఐక్యత దిశగా అడుగులు పడినట్లు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేటి నుండి తెలంగాణ లో వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం

నేటి నుండి తెలంగాణ లో వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం

లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

కవిత ఇంటికి సీబీఐ అధికారులు, ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు నోటీసులు

కవిత ఇంటికి సీబీఐ అధికారులు, ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు నోటీసులు

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?

స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?

సమయాన్ని హరించేస్తున్న సోషల్ మీడియా!

సమయాన్ని హరించేస్తున్న సోషల్ మీడియా!

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

📢 For Advertisement Booking: 98481 12870