తెలంగాణ (Telangana) ఇంటర్ బోర్డు నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (Advanced Supplementary) ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను (Exam results) జూన్ 16న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలు ఫెయిలైన విద్యార్థులకు తిరిగి ఉత్తీర్ణత సాధించేందుకు, అలాగే కొంతమంది విద్యార్థులకు మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం నిర్వహిస్తారు.

ఉత్తీర్ణత శాతం
ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌లో 67.4 శాతం, సెకండ్ ఇయర్‌లో 50.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఈసారి పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య
సబ్జెక్ట్ వైజ్ విద్యార్ధుల మార్కుల వివరాలు బోర్డు అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 4,12,724 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరిని విభాగాల వారీగా చూస్తే
పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలు
ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇందులో ఫస్ట్ ఇయర్ జనరల్‌లో 2,49,204 మంది, ఒకేషనల్‌లో 17,003 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక సెకండ్ ఇయర్ జనరల్‌లో 1,34,988 మంది, ఒకేషనల్‌లో 12,402 మంది విద్యార్థులు ఉన్నారు. మే 22 నుంచి మే 29వ తేదీ వరకు రోజుకు రెండు విడతల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ వెబ్ సైటులో మార్కులు చూసుకోవచ్చు
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లు https://tgbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in లలో ఫలితాలను పరిశీలించుకోవచ్చు.
Read also: Hyderabad: అధిక వర్షాలు కురుస్తున్న హైదరాబాద్ లో భూగర్భజలాలు పెరగలే