తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అమలవుతోంది. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి స్వంత స్థలంలో తలదాచుకునే స్థలం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తూ, మొదటి విడతలో 4,16,500 ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారు.అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ ఈ నెలలో వీలు అయినన్ని ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు(Indiramma illu) నిర్మాణం దిశగా ముందుకు సాగేలా దిశానిర్దేశం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.పేదలకు ఆత్మగౌరవం కలిగించడమే కాకుండా, వారికి స్వంత ఇంటి కలను నెరవేర్చేందుకు విశేషంగా దోహదపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చురుగ్గా సాగుతోంది.ప్రభుత్వానికి సహకరిస్తూ జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గ్రామ కమిటీలు కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులు పర్యవేక్షిస్తున్నారు.
ఆమోద ముద్ర
గ్రామాలవారీగా వచ్చిన దరఖాస్తుల్లో ప్రాధాన్య క్రమంలో నిరుపేదలను గుర్తిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో లబ్ధిదారుల తీరుని పరిశీలించి ఆమోద ముద్ర వేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంపీడీవోల స్థాయి(MPDO level)లో 2,86,016 మంది లబ్ధిదారులవి ఆమోదం పొందారు. జిల్లా కలెక్టర్ల స్థాయిలో 2,03,744 మందికి ఆమోదం లభించింది. ఇందులో గత నెల 28 నాటికి 1,89,997 మందికి మాత్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలను ఇచ్చారు. మొత్తంగా మంజూరు అయిన 4,16,500 ఇళ్లతో పోలిస్తే 45 % పురోగతి కనిపిస్తోంది. గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు దిశానిర్దేశం చేస్తూ వీలు అయినంత తొందరగా వీటి ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సహకరిస్తున్నారు.

మరికొంతమందికి
వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లిలో 19 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయగా, ఐదు ఇళ్లులు స్లాబ్ దశ పూర్తి చేసుకున్నాయి. మిగతా ఇళ్లులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందిరమ్మ పథకం కింద తొలిదశలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ అయ్యాయి. కొంతమందికి రూ.2 లక్షలు, మరికొంతమందికి రూ.4 లక్షల వరకూ జమ కావడం గమనార్హం. మొత్తం జిల్లాలో ఇప్పటివరకు 2,979 మందికి ఇళ్ల నిర్మాణ ఉత్తర్వులు జారీ అయ్యాయి.నారాయణపేట జిల్లా(Narayanpet District) కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో 212 ఇళ్లు మంజూరయ్యాయి, అందులో 106 ఇళ్లు ప్రారంభమైనవి. వీటిలో 22 పునాది దశలో ఉన్నా, 15 ఇళ్లు స్లాబ్ దశలో కొనసాగుతున్నాయి. జిల్లాకు మొత్తం 7,236 ఇళ్లు మంజూరవగా, 4,715 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు.
Read Also: Public Schools: తెలంగాణ లో త్వరలో 4 పబ్లిక్ స్కూల్స్