ICDS Director Shruti Ojha: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఐసిడిఎస్ రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి శృతి ఓజా తెలిపారు. సోమవారం ఆమె మెదక్ జిల్లాలో పర్యటించి పలు అంగన్‌వాడీ కేంద్రాలను, సంక్షేమ విభాగాలను స్వయంగా పరిశీలించారు.
Read Also: KCR Iftar Tradition: 35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన
నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించిన డైరెక్టర్, అక్కడ అందుతున్న సేవలను ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాలలో విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు 100 శాతం ఉండటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలోని ఐసిడిఎస్ పథకాల అమలుపై చర్చించారు.

ICDS Director Shruti Ojha: సఖి కేంద్రం మరియు బాలసదనం సందర్శన
జిల్లా కేంద్రంలోని ‘సఖి’ కేంద్రాన్ని సందర్శించిన శృతి ఓజా, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. డొమెస్టిక్ వయలెన్స్ (DV) కేసుల స్థితిగతులను, బాధితులకు అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న బాలసదనం పనులను పరిశీలించి, రాబోయే 99 రోజుల్లో పనులు పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పోషకాహారమే ప్రాధాన్యత
బాలసదనంలోని పిల్లలతో ముచ్చటించిన డైరెక్టర్, వారి సంరక్షణ విషయంలో రాజీ పడకూడదని సూచించారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని, అంగన్‌వాడీ మరియు సఖి కేంద్రాలలో మెరుగైన సేవలు అందుతున్నాయని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (DWO) హేమ భార్గవి, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
Read Also: