हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Ibrahimpatnam Municipality: కార్యాలయంపై రాళ్ల వర్షం.. అద్దాలు ధ్వంసం

Tejaswini Y
Ibrahimpatnam Municipality: Stones pelted on office..glasses broken
Ibrahimpatnam Municipality: Stones pelted on office..glasses broken

Ibrahimpatnam Municipality: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠకు మించి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో రాజకీయ పక్షాల మధ్య సాగుతున్న పోరు కాస్తా.. కౌన్సిల్ హాల్‌లో ఆందోళనలకు, బయట రాళ్ల దాడులకు దారితీసింది.ఎన్నిక ప్రారంభం కావాల్సిన సమయంలో, అదృశ్యమైనట్లు భావిస్తున్న కౌన్సిలర్ ఆకుల యాదగిరి సతీమణి వసంత తన కుటుంబ సభ్యులతో కలిసి కౌన్సిల్ హాల్‌లోకి దూసుకెళ్లారు. “మా వారు ఎక్కడున్నారో తేల్చాలి.. ఆయన వచ్చే వరకు ఎన్నికను వాయిదా వేయాలి” అంటూ పోడియం ముందు బైఠాయించారు.

Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేయగా పెనుగులాట చోటుచేసుకుంది. అదే సమయంలో మున్సిపల్ కార్యాలయం వెలుపల ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. కార్యాలయానికి సమీపంలోని రెండు ఇళ్ల పైనుంచి గుర్తుతెలియని వ్యక్తులు మున్సిపల్ ఆఫీసుపై రాళ్ల వర్షం(Stone Pelting) కురిపించారు. ఈ దాడిలో కార్యాలయ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానంతో పలువురు కాంగ్రెస్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చీలిన బీజేపీ.. ఉత్కంఠగా బలాబలాలు

కౌన్సిల్‌లో బలాబలాల లెక్కలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 24 మంది సభ్యులు హాజరుకాగా, బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ముత్యాల శ్యామల బీఆర్ఎస్‌కు మద్దతు తెలపగా, సిద్ధం భానుప్రియ కాంగ్రెస్‌కు జై కొట్టారు. కాంగ్రెస్ సభ్యులు ఎన్నికను వాయిదా వేయాలని పట్టుబడుతుండగా, బీఆర్ఎస్ తమకే మెజారిటీ ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. పట్టణమంతా భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870