హైదరాబాద్ మాదాపూర్‌లోని సున్నం చెరువు (Sunnam Cheruvu) వద్ద నిర్మాణాలపై హైడ్రా (Hydraa)కూల్చివేతలు చేపట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఆకస్మికంగా చర్యలు తీసుకోవడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. ఈ పరిణామాలపై సెరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మండిపడ్డారు. హైడ్రా సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు ప్రజల అభివృద్ధికి అనుగుణంగా ఉంటే, ఈ తరహా కూల్చివేతలు తగవు అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.
అరికెపూడి గాంధీ స్పందన
అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. “ఈ విధంగా చర్యలు తీసుకోవడం ప్రజలకు గందరగోళాన్ని సృష్టిస్తోంది. అధికారుల తీరుపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. హైడ్రా సంస్థ ఆర్థిక, ప్రణాళికా పరంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తోంది. సున్నం చెరువు ప్రాంతంలో అభివృద్ధి పేరుతో ప్రజా హక్కులను కాలరాస్తున్నారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయం వివరంగా చర్చిస్తామని తెలిపారు.
ఎంపీ ఈటెల రియాక్షన్
ఇక జవహర్‌నగర్‌లో జరుగుతున్న కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఇలాంటి చర్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి కానీ, నిర్మాణాలు తొలగిస్తూ ఇబ్బందులు కలిగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సమస్యలను అధికారులు ముందు గుర్తించి, సమగ్ర నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈటల సూచించారు.
Read Also : Banakacharla: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీకి కేంద్రం భారీ షాక్..