Gandhanguda government : హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను రక్షించే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా (HYDRA) మరో కీలక చర్య చేపట్టింది. ఐటీ కారిడార్‌కు సమీపంలోని గంధంగూడ ప్రాంతంలో సుమారు రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. మొత్తం 6.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ పరిధిలోని సర్వే నంబర్ 86/పి కింద ఉన్న ఈ భూమిని గతంలో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం కోసం జలమండలికి కేటాయించారు. అయితే కొందరు వ్యక్తులు అక్రమంగా షెడ్లు నిర్మించి స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు గుర్తించారు.
Read Also: ZIM vs SA: జింబాబ్వే టార్గెట్ 154.. సికందర్ రజా హాఫ్ సెంచరీ మెరుపులు!
జలమండలి అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా బృందం (Gandhanguda government) మున్సిపల్, రెవెన్యూ శాఖలతో కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించింది. భూమి ప్రభుత్వానికి చెందినదేనని నిర్ధారణ అయిన వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించిన అనంతరం స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నగర పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను రక్షించడం హైడ్రా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: